Ad Code

తగ్గిన స్మార్ట్ ఫోన్ ధరలు !


ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో వినియోగదారులని ఆకర్షించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి.  తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో సరికొత్త ఫోన్స్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన కొన్ని మొబైళ్లు ఇప్పుడు మంచి తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. తగ్గిన ధరతో స్పెసిఫికేషన్‌లను పోల్చి చూస్తే పైసావసూల్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ , యాపిల్ , సామ్‌సంగ్ , షావోమీ కి చెందిన కొన్ని మొబైల్స్‌పై ధర తగ్గాయి. ధరలో కోత పడ్డాక ఈ ఫోన్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వన్‌ప్లస్ 9 5జీ..ఎంఆర్‌పీ : రూ.49,999 – తగ్గిన మొత్తం – రూ.12,000 – ప్రస్తుత ధర: రూ.37,999 . 12 (iPhone 12).. ఎంఆర్‌పీ – 65,900 (64జీబీ – బ్లూ) – తగ్గిన మొత్తం : 10,000 – ప్రస్తుత ధర రూ.55,900గా ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ.. ఎంఆర్‌పీ – 29,909 – తగ్గిన ధర : 9,000 – ప్రస్తుత ధర రూ.20,999 (రిలయన్స్ డిజిటల్‌లో)గా ఉండగా, కీలక స్పెసిఫికేషన్లు చూస్తే 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్, 64 MP + 12 MP + 5 MP వెనుక కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్. వన్‌ప్లస్ 9 ప్రో 5జీ ఎంఆర్‌పీ – 64,999 – తగ్గిన ధర : 15,000 – ప్రస్తుత ధర రూ.49,999గా ఉంది. ఇక రెడ్‌మీ నోట్ 10టీ 5G సాధారణ ప్రారంభ ధర రూ.13,999 – తగ్గిన ధర రూ.2,000 – ప్రస్తుత ధర రూ.11,999 (అమెజాన్‌లో)గా ఉంది. జియోఫోన్ నెక్ట్స్ 4జీ సాధారణ ధర రూ.6,999 – తగ్గిన ధర రూ.1,900 – ప్రస్తుత ధర రూ.4,599. 

Post a Comment

0 Comments

Close Menu