శక్తివంతమైన సౌర తుపాను భూమిని తాకబోతోందని నాసా ప్రకటించింది. దాని ప్రభావంతో సెల్ఫోన్ సిగ్నళ్లు, జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు. తొలుత నిన్న తాకుందని అంచనా వేసినా, ఆ తర్వాత ఇవాళ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నిర్దారించారు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం వుందని హెచ్చరించారు.
భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను !
by Telugu Lo Computer at July 19, 2022
Labels:
science
,
technologe
,
జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశం
,
భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను
,
సెల్ఫోన్ సిగ్నళ్లు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment