దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ ఎం సిరీస్ నుండి 4G, 5G మోడళ్లను రేపు విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా పెద్ద బ్యాటరీ, ర్యామ్ ప్లస్ ఫీచర్ మరియు ఆటో డేటా స్వింగ్ వంటి మరిన్ని ఫీచర్లను అందించినట్లు శామ్సంగ్ చెబుతోంది. ఈ ఫోన్లను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ కొన్ని కీలకమైన ఫీచర్ లను శామ్సంగ్ వెల్లడించింది. దీని ప్రకారం, శామ్సంగ్ Galaxy M13 4G మోడల్ ట్రిపుల్ కెమెరాతో ఉంటే, Galaxy M13 5G మోడల్ మాత్రం వెనుక డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ముందు భాగం మాత్రం ఒకేవిధంగా కనిపిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4G మోడల్ 6,000 mAh హెవీ బ్యాటరీని కలిగి ఉంటే, శామ్సంగ్ గెలాక్సీ ఎం13 5G మాత్రం 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో అందించిన మరొక ఫీచర్ విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4G మరియు 5G, రెండు మోడళ్లలో కూడా ర్యామ్ ప్లస్ (RAM+) ఫీచర్ ని జతచేసినట్లు కూడా పేర్కొంది. ఈ ఫోన్ లలో అందించిన ఈ ఫీచర్ తో మల్టీ యాప్స్ ను కూడా హ్యాండిల్ చేయగలిగేలా 12GB ర్యామ్ వరకూ శక్తిని ఇస్తుందని టీజర్ ద్వారా తెలిపింది.
0 Comments