Ad Code

జులై 28న అసుస్ జెన్‌ఫోన్ 9 విడుదల ?


అసుస్ జెన్‌ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ లాంచ్ జులై 28వ తేదీన జరగనుంది. ఈ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. ఇందులో 5.9 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను కంపెనీ తన వెబ్‌సైట్లో అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ జులై 28వ తేదీన మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. న్యూయార్క్ ఉదయం 9 గంటలకు, బెర్లిన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు, తైపీలో రాత్రి 9 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అసుస్ జెన్‌ఫోన్ 9కు సంబంధించిన వివరాలు గతంలోనే లీకయ్యాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా అప్పుడే బయటకు వచ్చాయి. వీటిని బట్టి ఇందులో 5.9 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు డ్యూయల్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. సెక్యూరిటీ కోసం పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ బటన్ ద్వారా యూఐ పేజెస్‌ను కూడా స్క్రోల్ చేయవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా అందించారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu