Ad Code

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అద్భుత చిత్రాలు విడుదల


అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫొటోని జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కట్టే ఈ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా, ఈ టెలిస్కోప్ ఫాంటమ్ గెలాక్సీ అద్భుతమైన ఫొటోలను తీసి పంపింది. ఈ ఫొటోలను నాసా శనివారం విడుదల చేసింది. బ్లాక్‌హోల్‌తో కలర్‌ఫుల్‌గా ఉన్న ఫాంటమ్ గెలాక్సీ ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతున్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన గెలాక్సీ అసలు పేరు మెస్సియర్ 74. దీన్ని 1780లో చార్లెస్ మెస్సియర్ కనుగొన్నారు. ఎన్జీసీ 628గా కూడా పిలిచే ఈ స్పైరల్ గెలాక్సీని అంతరిక్ష ప్రియులు ముద్దుగా ఫాంటమ్ గెలాక్సీ అని పిలుస్తారు. ఇది గ్రాండ్ డిజైన్ స్పైరల్ గెలాక్సీకి సరైన ఉదాహరణ. ఇది నవంబర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలో గెలాక్సీ చిన్న చిన్న నీలిరంగు నక్షత్రాలను కలిగి ఉంది. ఈ నక్షత్రాలనుంచి వచ్చే అతినీలాలోహిత కాంతితో గెలాక్సీ గులాబీరంగులో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఈ గెలాక్సీని అద్భుతంగా, అత్యంత స్పష్టంగా చిత్రీకరించాయి.

Post a Comment

0 Comments

Close Menu