ఎస్‌బిఐ కస్టమర్ల కోసం మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్లు తమ ఖాతా వివరాలను (మినీ స్టేట్‌మెంట్) కొన్ని సెకన్లలోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాలోని బ్యాలెన్స్ కూడా చూడవచ్చు. దీని కోసం వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటిఎం సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ సహకారంతో కస్టమర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది ఎస్‌బిఐ. చాలా బ్యాంకులు కస్టమర్ల కోసం ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టాయి. ఇప్పుడు ఎస్‌బిఐ కాడా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. SBI WhatsApp బ్యాంకింగ్ సర్వీస్.. సేవింగ్స్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ఖాతాదారులు SBIలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ కస్టమర్లు రిజిస్ట్రేషన్ తర్వాత తమ ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా చూడవచ్చు. అలాగే, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ సేవను ఉపయోగించి ఖాతా వివరాలు, ఖర్చు వివరాలను చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా రివార్డ్ పాయింట్లు, బకాయి మొత్తంతో సహా ఇతర సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కార్డ్ హోల్డర్స్ తమ వాట్సాప్ నంబర్ నుండి 9004022022కు OPTIN అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. లేదంటే.. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 08080945040కి మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. ఎస్‌బిఐ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఫీచర్ కోసం సైన్ అప్ చేయవచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ నుండి ఫోన్‌లో మెసేజ్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి. మెసేజ్‌లో WAREG అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, మీ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్‌ను 7208933148కి SMS చేయాలి. ఇది రిజిస్టర్ కావాలంటే.. తప్పనిసరిగా ఈ నంబర్‌కు హాయ్ అని రిప్లై ఇవ్వాలి. ఆ తరువాత కాసేపటికే వాట్సాప్‌లో సర్వీస్ మెనూ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ పూర్తయినట్లుగా మీకు 90226 902226 నెంబర్‌తో whatsapp మెసేజ్ నంబర్ వస్తుంది.
0 Comments