ట్విట్టర్‌లో స్పేసేస్ క్లిప్స్ ఫీచర్ వచ్చేసింది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ట్విట్టర్ యూజర్ల అందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్పేసేస్ కొత్త క్లిప్పింగ్ టూల్ టెస్టింగ్ చేయడం ప్రారంభించినట్టు కంపెనీ ఇటీవల పేర్కొంది. ఇప్పుడు, ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. iOS, Android వెబ్‌లో ప్రతి ఒక్కరికీ క్లిప్పింగ్‌ని అందించనున్నట్టు కంపెనీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం.. ఈ ఫీచర్ ట్విట్టర్ వెబ్ యూజర్లకు అందుబాటులో లేదు. అతి త్వరలోనే అందరికి వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని నివేదిక వెల్లడించింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఇతరులతో షేర్ చేయడానికి రికార్డ్ చేసిన స్పేస్‌ల నుంచి 30 సెకన్ల ఆడియోను క్రియేట్ చేయొచ్చు. ఈ కొత్త టూల్ యూజర్లకు వారి స్పేస్‌లపై ఆసక్తిని పెంచేందుకు ఇదోక మార్గమని అంటోంది. అదే సమయంలో మొత్తం రికార్డింగ్‌ను షేరింగ్ చేసే టూల్ విషయంలోనూ అప్‌డేట్ చేసింది. ట్విట్టర్ స్పేసేస్ లాంచ్ చేయడానికి ముందే సామాజిక ఆడియో యాప్ క్లబ్‌హౌస్ గత సెప్టెంబర్‌లోనే క్లిప్పింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ పబ్లిక్ రూమ్‌లలో Live Listeners అత్యంత ఇటీవలి 30 సెకన్ల ఆడియోను Snip చేయడానికి ఎక్కడైనా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంతలో custom-built timelines కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. మొదట The Bacheloretteపై కేంద్రీకరించడం ప్రారంభించిందని తెలిపింది. అమెరికా, కెనడాలోని “Small Group” వ్యక్తుల కోసం వెబ్‌లో “Limited Test” వలె Bachelorette కస్టమ్ టైమ్ లైన్ 10 వారాల పాటు అందుబాటులో ఉంటుంది.
0 Comments