చైనా గత వారం లాంగ్‌మార్చి 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఇది అంతరిక్షంలో నిర్మించతలపెట్టిన స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను తరలించింది. చైనా 2020 నుంచి ఈ రాకెట్‌ను మూడోసారి ప్రయోగించడం గమనార్హం. తొలి రెండు రాకెట్ల మాదిరిగానే ఇది కూడా దిగువ భూకక్ష్యకు చేరుకొని మళ్లీ తిరిగి భూగోళం దిశగా జారిపోయింది. దీంతో ఇవి ఈ వారంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించవచ్చని అమెరికాకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవు, 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ శకలాలు పూర్తిగా కాలిపోవని.. కొన్ని భూఉపరి తలాన్ని తాకే ప్రమాదం ఉందని అంచనావేస్తున్నారు. గతంలో చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్5బీ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా చైనాకు చెందిన గుర్తుతెలియని రాకెట్ శిథిలాలు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో పడ్డాయి. గతంలో చైనా రాకెట్ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై కూలి బీభత్సం సృష్టించాయి.
0 Comments