Ad Code

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేత !


ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్‌లో 4 వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి చేసిన వేల స్కూటర్ల కంటే ఇవి అదనం. చెన్నై యూనిట్‌లో రోజువారీగా 6 వందల స్కూటర్లు ఉత్పత్తి చేయొచ్చు. గత నెల 21 నుంచి ప్రొడక్షన్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది. వార్షిక మెయింటెనెన్స్, నూతన యంత్రాలను బిగించడం కోసం ఉత్పత్తిని నిలిపేశామని ఓలా కంపెనీ యాజమాన్యం చెబుతోంది. కానీ భారీగా నిల్వలు పేరుకుపోవడం కారణమంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్తలో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రారంభంలో 1.50 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. కానీ వాటి పనితీరులో లోపం, సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న ఫిర్యాదులతో భారీ సంఖ్యలో స్కూటర్ల బుకింగ్స్ రద్దు చేసుకున్నారు కస్టమర్స్‌. రోడ్లపైకి వచ్చిన వాటిలో అగ్ని ప్రమాదాలు జరుగడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు, లోపాలు, సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇలా అన్ని కారణాలతో సేల్స్ తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఉత్పత్తి నిలిపివేసినట్టు సమాచారం.


Post a Comment

0 Comments

Close Menu