Ad Code

ఆవులకు ఫేస్ రికగ్నిషన్ యాప్


ఆవులకు కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆవుల ముఖకవళికలు గుర్తించే ఈ యాప్‌ను గుజరాత్‌లోని అహమ్మదాబాద్ ఐఐఎం నిపుణులు రూపొందించారు. 'గాయ్ ఆధారిత్ ఉన్నతి' పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. తాజాగా ఆ పరిశోధనా పత్రాన్ని ఫ్యాకల్టీ మెంబర్ అమిత్ గార్గ్ వెల్లడించారు. పరిశోధనల కోసం ఉత్తర ప్రదేశ్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలను ఎంచుకున్నట్టు తెలిపారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌లో గోవుల ముఖ కవళికలను నమోదు చేశామని, తర్వాత వాటికి పేర్లు పెట్టి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేశామని వివరించారు. తర్వాత 'cow విజన్ యాప్'తో స్కాన్ చేసినప్పుడు 92 శాతం ఖచ్చితత్వంతో గుర్తించగలిగిందని పేర్కొన్నారు. ఇప్పటికీ గ్రామీణ భారతంలో ఆవులు ప్రముఖ పాత్ర పోషిస్తుండడంతో ఈ యాప్ అవసరాన్ని గుర్తించామని చెప్పారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. దేశవ్యాప్తంగా గోశాలల్లో ఉన్న లక్షల ఆవులకు ప్రయోజనం ఉంటుందనీ, దాతలు వాటిని ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాక, ఈ యాప్ ద్వారా ఆవుల దత్తత భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu