ఇండియాలో గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసింది. స్ట్రీట్ వ్యూ సేవల్ని అందించేందుకు గూగుల్ మ్యాప్స్... జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ 11 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా, ప్రభుత్వ రెగ్యులేషన్స్ కారణంగా భారతదేశానికి చాలా ఆలస్యంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా వీధుల మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు కార్లపై కెమెరాలు ఉంటాయి. కానీ ఇండియాలో ఖర్చు తగ్గించుకునేందుకు టెక్ మహీంద్రా మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు ఆటోలపై కెమెరాలను అమర్చింది. ఆ ఆటోలు రోడ్లు, వీధుల్లో తిరుగుతూ మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేస్తుంటాయి. గూగుల్‌కు లైసెన్స్ స్ట్రీట్ వ్యూ డేటా అందించేందుకు టెక్ మహీంద్రా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఇలా మహీంద్రా ఆటోలను ఉపయోగిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్ పర్సన్ ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. అన్ని రూట్లల్లో ఆటోలనే ఉపయోగిస్తున్నారా అన్న వివరాలైతే ప్రస్తుతానికి లేవు. భారతీయ రోడ్ల పరిస్థితులు, ప్రాంతాలను బట్టి మహీంద్రా లాజిస్టిక్స్ వేర్వేరు వాహనాలను ఉపయోగిస్తూ ఉండవచ్చు. గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 10 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్సర్ స్ట్రీట్ వ్యూ సేవలు లభిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే మొత్తం 1,50,000 కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూ కవర్ చేయనుంది. 2022 చివరి నాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ కోసం ఆటోపై ఈ కెమెరాలు ?
by Telugu Lo Computer at July 29, 2022
Labels:
google
,
science
,
technologe
,
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ కోసం ఆటోపై ఈ కెమెరాలు ?
,
జెనిసిస్ ఇంటర్నేషనల్
,
టెక్ మహీంద్రా సంస్థలతో ఒప్పందం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment