ఓ గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమిపై పడితే చాలా ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం ఈ రోజే భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా గ్రహశకలాలు ఇప్పుడు భూమి వైపు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలూ జరిగాయి. కొన్ని ప్రమాదం కలిగిస్తే మరికొన్నింటి ద్వారా ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. అంతరిక్షం నుంచి భూమికి మరో ప్రమాదం రాబోతోంది. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా వెల్లడించింది. ఈ శకలం గంటకు 49,513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు పయనిస్తున్నట్లు పేర్కొంది. 450 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గ్రహ శకలం మిగతా వాటితో పోలిస్తే చిన్నదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఇది భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, పొటెన్షియల్లీ హజార్డస్ గ్రహశకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013బీవో76 అని పిలిచే ఇది ఈసారి భూమికి 51,11,759 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతుందని, భూమిపై ఎటువంటి ప్రభావమూ చూపబోదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ గ్రహశకలం ఈ రోజే భూమిని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. 2033 జులై 14న మరోసారి ఇది భూమి దగ్గరకు వస్తుందనే అంచనాలున్నాయి.
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహ శకలం
by Telugu Lo Computer at March 24, 2022
Labels:
nasa
,
science
,
technologe
,
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహ శకలం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment