బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఓబెన్ ఎలక్ట్రిక్ 'రోర్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ. 99,999 లను ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించిన ఈ బైక్‌ను రూ. 999లకే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సబ్సీడీలు, లోన్ సౌకర్యం, బీమా వంటి వివరాలను ఈ - అమృత్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది . ఇక ప్రత్యేకతల విషయానికొస్ నియో క్లాసికల్ డిజైన్‌తో వచ్చిన ఈ బైక్ ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. 4.4 కిలోవాట్ లిథియం ఆయాన్ బ్యాటరీతో పాటు 10 కిలోవాట్ కెపాసిటీ గల మోటారును అమర్చారు. మూడు సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 100 కిలోమీటర్ల వెళ్లగల సామర్ధ్యం రోర్ సొంతం. స్పోర్టీ లుక్, చార్జింగ్ స్టేషన్ తెలుసుకునే సదుపాయాలతో పాటు బ్యాటరీని చోరీ చేయకుండా కాపాడే వ్యవస్థలున్నాయి. వినూత్న ఫీచర్లు గల ఈ బైక్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని కంపెనీ తెలిపింది.
0 Comments