నోకియా నుంచి Nokia CO1 Plus సిరీస్ సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 32GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే నోకియా C01 ప్లస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, Nokia.comలో వరుసగా రూ. 6,299, రూ. 6,799 ధరతో Nokia C01 Plus స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ నోకియా CO1 Plus సిరీస్ స్మార్ట్ ఫోన్ JioExclusive ఆఫర్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. కస్టమర్‌లు కొనుగోలు ధరపై రూ. 600 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు వేరియంట్లపై వరుసగా రూ. 5,699, రూ. 6,199 చెల్లించాల్సి ఉంటుంది. గత రెండు ఏళ్లుగా వినియోగదారులకు అనేక ఫీచర్ మోడళ్లను అందించడంలో నోకియా పోర్ట్‌ఫోలియోను రూపొందించింది. తక్కువ-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా నోకియా C-Series ప్రవేశపెట్టింది. ఎక్కువ కాలం మన్నిక అనేది నోకియా డివైజ్‌లపై యూజర్లలో మరింత విశ్వాసాన్ని పెంచింది. నోకియా C01 Aplus గత ఏడాదిలో ప్రారంభమైనప్పుడు మా యూజర్ల నుంచి చాలా మంచి ఆదరణ పొందిందని HMD గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే నోకియా C01 ప్లస్ 5.45-అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తోంది. డివైజ్ పైన కింద అంచుల భాగంలో మందపాటి బెజెల్స్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. వెనుకవైపు.. 5MP HDR కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లోని రెండు కెమెరాలు ప్రత్యేక LED ఫ్లాష్‌తో వచ్చాయి. ఇక స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 1.6GHz Unisoc SC9863A ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు. నోకియా C01 ప్లస్ 3000mAh బ్యాటరీతో వచ్చింది. ఛార్జింగ్ ఒకసారి పెడితే ఆ రోజుంతా ఉంటుంది.
0 Comments