Ad Code

22న రియల్‌మీ నార్జో 50 సిరీస్‌ విడుదల


ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మీ  క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. రీసెంట్ గా రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో నార్జో 50, నార్జో 50ఐ, నార్జో 50ఏ ఫోన్లను లాంచ్ చేసి మొబైల్ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా మరో ఫోన్‌ను లాంచ్ చేయడానికి రియల్‌మీ కంపెనీ రెడీ అయ్యింది. ఈ మార్చి 22న రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్  అనే సరికొత్త మోడల్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేయనున్నట్లు రియల్‌మీ కంపెనీ ప్రకటించింది. ఇది త్వరలోనే ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రియల్‌మీ కంపెనీ ఇండోనేషియా లో నార్జో 50ఏ ప్రైమ్ లాంచింగ్ డే ట్ ను ప్రకటించింది కానీ దాని స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. అయితే రియల్‌మీ తన అఫీసియల్ రియల్‌మీ ఇండోనేషియా వెబ్‌సైట్‌లో ఒక ఇమేజ్ ను పోస్ట్ చేసింది. ఈ ఇమేజ్ ప్రకారం, రియల్‌మీ 50ఏ ప్రైమ్ థిక్ బాడీ తో కూడిన iPhonesque డిజైన్‌, ట్రిపుల్ కెమెరా సెన్సార్‌లు, హెడ్‌ఫోన్ జాక్, బాటమ్ లో స్పీకర్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఫ్లాట్ పవర్ కీ రైట్ సైడ్ ఎడ్జ్ లో ఉండగా వాల్యూమ్ బటన్స్ ఎడమ వైపున కనిపించాయి. ఇందులోని పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లా కూడా పని చేస్తుందట. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ 1080p రిజల్యూషన్‌తో 6.6-ఇంచుల నాచ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ట్రిపుల్ కెమెరా సిస్టమ్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0పై పని చేయవచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నార్జో 50ఏ ప్రైమ్ ఫోన్ 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే అనేక వెరిఫైడ్ సైట్‌లలో కనిపించింది. వీటి ప్రకారం, ఫోన్ కొలతలు 164.3 x 75.6 x 8.15 ఎంఎం కాగా బరువు 193 గ్రాములు ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్ల వివరాలు త్వరలోనే తెలియరావచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో రియల్‌మీ నార్జో 50ఏ, రియల్‌మీ నార్జో 50ఐ అనే రెండు ఫోన్లను తీసుకువచ్చింది. రియల్‌మీ 50ఏ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. రియల్‌మీ 50ఐ అనేది Unisoc SC9863A చిప్‌సెట్, ఆండ్రాయిడ్ గో ఎడిషన్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu