పోకో ఎక్స్ ప్రో 5జీ మార్చి 28న విడుదల


చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి  తీసుకు రానున్నది. పోకో ఎక్స్ ప్రో 5జీ  పేరుతో రాబోయే ఫోన్ మార్చి 28న దేశంలో విడుదల కానున్నది. ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.  మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్‌ను వెల్లడిస్తూ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. పోకో ఎక్స్ ప్రో 5జీ  ఇండియా వేరియంట్ టీజర్ ప్రకారం ఇది 64-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్  2022లో Poco M4 Pro 4Gతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభించబడింది. Poco X4 Pro 5G యొక్క గ్లోబల్ వేరియంట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా రన్ అవుతూ 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org