స్వదేశీ బ్రాండ్ ఐటెల్ కొత్తగా A49 స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. దాని A సిరీస్ పరంపరను కొనసాగిస్తూ ఐటెల్ A49 మోడల్‌ను తెచ్చింది. 6.6" HD+ IPS వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, భారీ 4000 mAh Li-పాలిమర్ ఇన్‌బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. 6.6-అంగుళాల స్మార్ట్‌ఫోన్, IPS ప్యానెల్ HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌ను అందిస్తోంది. 4,000mAh బ్యాటరీతో 10W చార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంది. Itel A49 2GB RAM 32GB స్టోరేజీని కలిగి ఉంది. దీనిని mico SD కార్డ్ స్లాట్ ద్వారా 128GB వరకు విస్తరించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ 5MP AI వెనుక కెమెరా, స్పష్టమైన సెల్ఫీల కోసం AI బ్యూటీ మోడ్‌తో కూడిన 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ, స్కై సియాన్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.