గత కొన్నేళ్లలో స్మార్ట్‌ఫోన్లతోపాటు ఐప్యాడ్, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరిగాయి. కొవిడ్ అనంతరం ట్యాబ్లెట్ల విక్రయాలు జోరందుకొన్నాయి. కాలింగ్, వైఫై, పెద్ద స్క్రీన్‌తో అందుబాటులో ఉండే ట్యాబ్లెట్లను కొనేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మార్కెట్‌లో యాపిల్ సంస్థదే హవా అని చెప్పాలి. స్మార్ట్‌ఫోన్లలో రాణించినంతగా ఆండ్రాయిడ్.. ట్యాబ్లెట్లలో క్లిక్ కాలేదు. అయితే భవిష్యత్తు మొత్తం ట్యాబ్లెట్లదే అని.. దానిపై దృష్టి పెట్టామని తాజాగా గూగుల్ సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల అమ్మకాలు ల్యాప్‌టాప్ లను అధిగమించనున్నాయి. ఈ విషయాన్ని గతవారం గూగుల్ సంస్థ ప్రకటించింది. భవిష్యత్తులో తీసురానున్న అప్టేట్‌లు, ఫీచర్లకు సంబంధించిన అంశాల్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల ను చేర్చింది. దీని గురించి గూగుల్ ఆండ్రాయిడ్ అండ్ సీటీవో ట్యాబ్లెట్స్ కో ఫౌండర్ రిచ్ మిల్నెర్ , ది ఆండ్రాయిడ్ షో వోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ట్యాబ్లెట్‌లు, జెట్‌ప్యాక్ కంపోజ్, ఆండ్రాయిడ్ 12 గురించి జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని విషయాలు చర్చించారు. సంవత్సరాలుగా ట్యాబ్లెట్‌ల కోసం విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌గా మారడంలో ఆండ్రాయిడ్ విఫలమైందని అంగీకరించారు. స్మార్ట్‌ఫోన్లలో సాధించగలిగినంత పురోగతి, ట్యాబ్లెట్ల విషయంలో ఆండ్రాయిడ్‌కు సాధ్యపడలేదని తెలిపారు.
0 Comments