అంతరిక్షంలో వ్యోమగాములు అప్పుడప్పుడూ నడుస్తుంటారు. దీన్నే స్పేస్‌వాక్ అంటారు. అయితే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడుస్తున్న ఇద్దరు వ్యోమగాములను ఓ ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ భూమినుంచి క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రో ఫొటోగ్రాఫర్లు భూమిపైనుంచే సుదూర గెలాక్సీలు, గ్రహాల ఫొటోలను తీస్తుంటారు. గతవారం సెబాస్టియన్ వోల్ట్‌మెర్ అనే ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ ఓ ప్రత్యేకమైన ఫొటో తీశారు. నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు రాజాచారి, మాథియాస్ మౌరర్ మార్చి 23న ఐఎస్ఎస్ బయట ఏడు గంటలు గడిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా వారు బయట స్పేస్‌వాక్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో వోల్ట్‌మెర్ వాళ్ల చిత్రాలను అద్భుతంగా ఫొటో తీశాడు. ఈ ఫొటోను జర్మనీలోని మౌరర్ స్వస్థలమైన సంక్త్ వెండెల్ నుంచి క్యాప్చర్ చేశాడు. ఇందులో ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నారు.
0 Comments