ఒకప్పుడు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.30,000 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్‌లో మొబైల్స్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజైంది. అయితే త్వరలో రూ.20,000 బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ మోడల్ రానుందని వార్తలొస్తున్నాయి. అంటే ఇప్పటికే ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కన్నా కాస్త తక్కువ ఫీచర్స్‌తో ఈ మొబైల్ లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లిస్ట్ అయ్యాయన్నది ఆ వార్తల సారాంశం. లీక్స్ ప్రకారం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుందని అంచనా. ఇటీవల స్నాప్‌డ్రాగన్ 695 బాగా పాపులర్ అయింది. ఇప్పటికే ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో కొన్ని స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 లాంటి మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ రూ.20,000 లోపు ధరలోనే రిలీజ్ కావడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ ఉండదు. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంచనా. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్2టీ మోడల్స్ కూడా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్ నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన లీక్స్, న్యూస్ వన్‌ప్లస్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
0 Comments