టార్క్ మోటార్స్ కంపెనీ క్రటోస్ ఆర్ పేరుతో మార్కెట్లో అందిస్తోంది. ఇందులో 9 కేడబ్ల్యూ పీఎంఏసీ మోటార్ అమర్చారు. దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ 180 కిలోమీటర్లు వెళ్తుంది. చార్జింగ్ టైమ్ 4 నుంచి 5 గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ చార్జింగ్ అయితే గంటలో 80 శాతం ఫుల్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్లూ, రెడ్, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఫుల్లీ డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్, రిరవ్స్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2,28,374గా ఉంది. అయితే దీనిపై ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ. 60 వేల డిస్కౌంట్ వస్తుంది. ఇంకా స్టేట్ సబ్సిడీ కలుపుకుంటే రూ. 10 తగ్గింపు పొందొచ్చు. ఇలా మొత్తంగా రూ. 70 వేల డిస్కౌంట్ ఉంది. దీంతో ఈ బైక్‌ను రూ. 1,58,374కు కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఈ బైక్‌పై ఈఎంఐ నెలకు రూ. 2999 నుంచి ప్రారంభం అవుతోంది. ఎంచుకునే టన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మొత్తం మారుతుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎకోఫై, రూపే, లిక్విలోన్స్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుకు రుణాలు అందిస్తున్నాయి. అందువల్ల మీరు ఈజీగానే ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. బ్యాటరీ రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుందనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి ధర ఎక్కువగా ఉంటుంది.
టార్క్ మోటార్స్ కంపెనీ క్రటోస్ ఆర్
by Telugu Lo Computer at May 22, 2023
Labels:
28
,
374
,
electric bike
,
technology
,
ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2
,
టార్క్ మోటార్స్ కంపెనీ క్రటోస్ ఆర్
,
మొత్తంగా రూ. 70 వేల డిస్కౌంట్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment