Ad Code

ఐఫోన్లలో చాట్‌జిపిటి యాప్ రిలీజ్


చాట్‌జిపిటి లాంచ్ అయినప్పటిని నుంచి ఒక సంచలనంగా మారింది. బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా ఇది పాపులర్ అయింది. మైక్రోసాఫ్ట్ ప్రోత్సాహంతో OpenAI సంస్థ డెవలప్ చేసిన ఈ ChatGPT టూల్ ఇప్పటి వరకు వెబ్‌ మోడ్‌లోనే సేవలు అందించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ చాట్‌బాట్‌ను యాప్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఫోన్లకు మాత్రమే ఈ యాప్ రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చాట్‌జిపిటి యాప్ త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలోని ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే చాట్‌జిపిట్ యాప్‌కు యాక్సెస్ లభిస్తుందని, ఆ తర్వాత ఇతర దేశాల్లో లాంచ్ చేస్తామని ఓపెన్ ఏఐ కంపెనీ పేర్కొంది. ChatGPT ఫర్ iOS యాప్ ఇప్పుడు వాయిస్ ఇన్‌పుట్స్‌కు కూడా యాక్సెస్ ఇస్తుంది. విస్పర్   అనే ఓపెన్ సోర్స్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ కొలాబరేషన్‌తో దీన్ని డెవలప్ చేసినట్లు వెల్లడించింది. 'USలో మా చాట్‌జిపిటి ఐఓఎస్ యాప్‌ను రోల్‌అవుట్‌ చేస్తున్నాం. రాబోయే వారాల్లో మరిన్ని దేశాలకు విస్తరిస్తాం. యూజర్లు యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో చూడటానికి ఆసక్తిగా ఉన్నాం. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ChatGPT యాప్‌కు ఫీచర్, సేఫ్టీ ఇంప్రూవ్‌మెంట్స్ అదిస్తాం.' అని OpenAI బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు ChatGPT కేవలం క్రోమ్, సఫారీ వంటి బ్రౌజర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ , ఐఫోన్ యూజర్లు అందరూ సైన్ ఇన్ అయ్యి ఈ సేవలను యాక్సెస్ చేసుకునే ఆప్షన్ ఉంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకొని అదనపు సేవలను ఆస్వాదించే వీలు కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ఈ టూల్ ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు యాప్ రూపంలో లాంచ్ అయింది. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ యాప్‌లో ChatGPT ప్లస్ సబ్‌స్క్రైబర్స్ తమ బెనిఫిట్స్ పొందడం కంటిన్యూ చేయవచ్చు. ప్లస్ మెంబర్‌షిప్ మెరుగైన, వేగవంతమైన రెస్పాన్సెస్, ప్లగ్ ఇన్స్, నో వెయిటింగ్ టైమ్ వంటి బెనిఫిట్స్‌ ఆఫర్ చేస్తుంది. చాట్‌జిపిటి ఐఓఎస్ యాప్ iOS 16.1, అంతకంటే అడ్వాన్స్‌డ్ ఓఎస్‌తో రన్ అయ్యే డివైజ్‌లలో పనిచేస్తుంది. యాప్ స్టోర్ లిస్టింగ్‌లో దీని గురించి కంపెనీ కొన్ని విషయాలను హైలెట్ చేసింది. ఇన్‌స్టంట్ ఆన్సర్స్, టెయిలర్డ్ అడ్వైస్, క్రియేటివ్ ఇన్‌స్పైరేషన్, ప్రొఫెషనల్ ఇన్‌పుట్, పర్సనలైజ్డ్ లెర్నింగ్.. వంటి వాటిని యాప్ ఆఫర్ అందజేస్తుందని పేర్కొంది. యాప్ స్టోర్ ప్రైవసీ లేబుల్‌లో.. ChatGPT కాంటాక్ట్ ఇన్‌ఫో, యూజర్ కంటెంట్, ఐడెంటిఫైయర్స్, డేటా యూసేజ్ వంటివన్నీ ట్రాక్ చేస్తుందని మెన్షన్ చేసింది. కంపెనీ తాజా అనౌన్స్‌మెంట్‌తో ఫేక్ ChatGPT యాప్స్‌కు చెక్ పెట్టినట్టు అయింది.

Post a Comment

0 Comments

Close Menu