Ad Code

చైనాలో చాట్ జీపీటీ స్థానంలో ఎర్నీ బోట్‌ !


ప్రపంచం మొత్తం గూగుల్‌ను వాడితే, చైనా మాత్రం తమకంటూ ఓ గూగుల్‌లాంటి సెర్చ్‌ ఇంజిన్‌ను క్రియేట్‌ చేసుకుంది. దాన్నే ఇప్పుడు వాడుతోంది. అన్నింటికి ప్రత్యామ్నాయాలు సృష్టించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ విషయంలోనూ చైనా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రపంచం మొత్తం వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ చాట్‌జీపీటీని కాదని ఓ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంది. ''ఎర్నీ బోట్‌'' పేరిట ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చైనా మొత్తం ఈ ఎర్నీ బోట్‌నే వాడుతోంది. ఈ ఎర్నీబోట్‌ చైనా ప్రజలకు ఒకరకంగా చుక్కలు చూపెడుతోంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఏ కామెంట్‌ చేయటం లేదు. దానికి తోడు అలాంటి ప్రశ్నలు అడిగిన వారిని బ్లాక్‌ చేస్తోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ రిపోర్టర్‌ '' చైనా అధ్యక్షుడు క్షీకి.. కార్టూన్‌ బొమ్మ విన్ని దీ పూనకు'' ఉన్న సంబంధం ఏంటి అని ఎర్నీని అడిగాడు. సాధారణంగా చైనా ప్రజలు తమ అధ్యక్షుడి మూతిని విన్ని దీ పూ అనే కార్టూన్‌ బొమ్మతో పోలుస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఎర్నీ సమాధానం చెప్పలేకపోయింది. ప్రశ్న అడిగిన వెంటనే కనెక్షన్‌ కట్‌ అయింది. ఆ రిపోర్టర్‌ '' కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది'' అని మరో ప్రశ్న అడిగాడు. ఇందుకు ఎర్నీ సమాధానం ఇస్తూ  '' కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు'' అని సమాధానం ఇచ్చింది. చైనాలోనే కరోనా పుట్టిందని అందరికీ తెలిసినా దాన్ని ఎర్నీ అంగీకరించటం లేదు. దాన్ని అలా డిజైన్‌ చేశారు. ఈ ఎర్నీ బోట్‌ కారణంగా చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu