Ad Code

55 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న బీటీ గ్రూప్ !


బ్రిటన్కు చెందిన వోడాఫోన్ 11వేల మంది ఉద్యోగుల్ని తొలిగిస్తామని చెప్పిన రెండురోజులకే బీటీ గ్రూప్ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. ఖర్చులు తగ్గించే ఉద్దేశ్యంతో బ్రిటన్కు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బీటీ గ్రూప్ సుమారు 42 శాతం సిబ్బందిని తగ్గించేందుకు సిద్ధమైంది. మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్ని తీసివేయనుంది. 2030 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు కంపెని ప్రకటించింది. బీటీ సంస్థలో సుమారు లక్షా 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న అయిదు నుంచి ఏడేళ్లలో తమ ఉద్యోగుల సంఖ్యను 75 వేల నుంచి 90 వేల వరకు కుదించనుంది. ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ 5 జీ మొబైల్ నెట్‌వర్క్‌ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెయింటనెన్స్ కోసం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఈ దశాబ్దం చివరికి లీనియర్‌ బిజినెస్‌తో బ్రైటర్‌ ఫ్యూచర్‌గా బీటీ గ్రూప్‌ రూపాంతరం చెందుతుందని, బెస్ట్‌ అండ్‌ టాప్‌, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌లకు ఉత్తమమైన కస్టమర్ సర్వీస్, సొల్యూషన్‌లతో కనెక్ట్ అవుతుందని గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu