అమెజాన్ మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైంది. మార్చిలో చెప్పినట్లుగానే తాజాగా 9 వేల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈవో యాండి జెస్సీ వెల్లడించారు. వీరిలో భారతదేశానికి చెందిన 500 మంది ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నామన్నారు. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. త్వరలోనే ఉద్యోగులకు ఈ సమాచారం అందిస్తామన్నారు. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్‌ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారన్నారు. మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ చేసిన ప్రకటనలో భాగంగానే ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందించారని కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు. తాజా లేఆఫ్స్‌తో ఈ సంవత్సరం ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్టయింది.
0 Comments