మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ సురక్షితంగా ఉండటానికి, ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అనేక విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చాలామంది తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.. కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు ఒక్కోసారి భారీ ప్రమాదాలకు కారణం అవుతాయి. కొన్నిసార్లు మొబైల్ ఫోన్స్ బాంబులా పేలే ప్రమాదం ఉంది. ఒకే సాకెట్లో రెండు మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం చేయొద్దు, ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్‌పై మరొక ఫోన్‌ను పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్లు వేడెక్కి పేలే ప్రమాదం ఉంది, ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్‌తోనే ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాలి. లేదా సదరు కంపెనీకి చెందిన ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లోకల్ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోవడం, లేదా కాలిపోవడం జరుగుతుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను పొరపాటున కూడా ఉపయోగించొద్దు. చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ బాగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.
మొబైల్ ఫోన్ - ఛార్జింగ్ - జాగ్రత్తలు !
by Telugu Lo Computer at May 29, 2023
Labels:
smart phones
,
technology
,
ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్‌పై మరొక ఫోన్‌ను పెట్టకూడదు
,
మొబైల్ ఫోన్ - ఛార్జింగ్ - జాగ్రత్తలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment