అమెజాన్ ఫీజులు, కమిషన్ ఛార్జీలను సవరించాలని నిర్ణయించింది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం మే 31 నుంచి కొత్త ఫీజులు, కమిషన్ ఛార్జీలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్ లాంటి అనేక ఉత్పత్తులపై ఈ కొత్త ఛార్జీలు విధించబడతాయి. ఈ పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్, కిరాణా సామాగ్రి, మందులు లాంటి ఉత్పత్తులపై సెల్లర్స్ ఫీజ్ పెంచాలని అమెజాన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఉత్పత్తుల రిటర్న్ ఫీజులను కూడా గణనీయంగా పెంచనున్నట్టు సమాచారం. ఓవర్-ది-కౌంటర్ ఔషధాల కోసం సెల్లర్ ఫీజు రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువైన ఉత్పత్తులకు 5.5% నుంచి 12% వరకు పెరుగుతుందని అంచనా. రూ. 500 కంటే ఎక్కువ ధర ఉన్న వస్తువులకు సెల్లర్ ఫీజు 15% ఉంటుంది. మార్కెట్ డైనమిక్స్, వివిధ ఆర్థిక కారకాలు, పలు అంశాలపై సెల్లర్ ఫీజ్ సవరణలు ఆధారపడి ఉంటాయని, ప్రస్తుతానికి, తాము ఫీజు రేట్ కార్డ్‌లో మార్పులు చేసామని, ఇందులో కొత్త ఫీజు కేటగిరీలు, కొన్ని కేటగిరీలలో తగ్గిన ఫీజులు ఉన్నాయిని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.
0 Comments