దేశీయ మార్కెట్లోకి రెడ్మీ ఏ2, రెడ్మీ ఏ2+ స్మార్ట్‌ఫోన్లు విక్రయాలు ఈరోజు నుంచే ప్రారంభించారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లపై కంపెనీ మంచి మంచి ఆఫర్లను సైతం అందజేస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఒకేరకమైన ఫీచర్లున్నాయి. అయితే ఏ2ప్లస్ లో మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. గత సంవత్సరం విడుదలైన రెడ్‌మీ A1 సిరీస్ కన్నా A2 సిరీస్‌లో అదనపు హంగులతోపాటు శక్తివంతమైన చిప్‌లను యాడ్ చేశారు. A2 స్మార్ట్‌ఫోన్ 2GB రామ్, 32GB స్టోరేజీ మోడల్ రూ.6,299. బ్యాంకు కార్డులతో ఆర్డర్ చేయడంద్వారా రూ.వెయ్యి తగ్గింపుతో రూ.5,999కే పొందొచ్చు. 2GB రామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ వేరియంట్ ధర రూ.6,999. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.7,999. A2+ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64GB స్టోరేజీతో ఒకే మోడల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,499. అమెజాన్, Mi వెబ్‌సైట్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ రంగుల్లో లభిస్తాయి. ICICI బ్యాంకు కార్డులను ఉపయోగించి A2 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫోన్లకు రెండు సంవత్సరాల వారంటీ ఉంది. రెడ్ మీ A2, Redmi A2+ స్మార్ట్‌ఫోన్లు ఒకే విధమైన ఫీచర్లతో వచ్చాయి. 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగివున్నాయి. ఇది 400 నిట్‌ల బ్రైట్‌నెస్ తో ఉంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేటుతో ఎల్ సీడీ డిస్‌ప్లే ఉంది. Media Tek Hello G36 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వీటిని 7GB వరకు పెంచుకోవచ్చు. కంపెనీ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌ను అందించింది. 4G LTE నెట్‌వర్క్ లను సపోర్ట్ చేసే డ్యూయల్ సిమ్ పోర్ట్ ఉంది. A2+ స్మార్ట్‌ఫోన్‌కి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. A2లో ఈ ఫీచర్ లేదు. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, QVGA కెమెరాతో AI సపోర్ట్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంది. మైక్రో USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
0 Comments