Ad Code

రెండేళ్ల వారెంటీతో రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ ఫోన్ల విడుదల


షావోమీ కంపెనీ ఏ2, ఏ2ప్లస్ ఫోన్ లను ఇవాళ మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన ఏ1 సిరీస్ కు కొనసాగింపుగా ఏ2 సిరీస్ను తీసుకొచ్చింది. 10వేల లోపు బడ్జెట్లో రెండేళ్ల వారెంటీతో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్స్ ఒకేలా ఉండటం విశేషం. దేశీయ మార్కెట్లోకి మే 23 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రెడ్‌మీ ఏ2 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 2జీబీ-32జీబీ వేరియంట్‌ ధర రూ.5999గా కంపెనీ నిర్ణయించింది. 2జీబీ-64జీబీ వేరియంట్‌ ధరను రూ.6,499గానూ, 4జీ - 64జీబీ వేరియంట్‌ ధరను రూ.7,499గానూ కంపెనీ ప్రకటించింది. A2+ మోడల్‌ 4జీబీ-64జీబీ వేరియంట్‌లో 8,499 ధరకు లభిస్తోంది. ఈ రెండు ఫోన్లూ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, లైట్‌ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉండనున్నాయి. మే 23 నుంచి అమెజాన్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లు, రిటైల్‌ స్టోర్లలో విక్రయించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. 6.52 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్స్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్లలో 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. రెడ్ మీ ఏ2 ప్లస్లో అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. రెండు ఫోన్లకు ఇదొక్కటే తేడా. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu