ఒప్పో రెనో 10 ప్రో + తోపాటు రెనో 10 సిరీస్ ఫోన్లను ఈ నెల 24న చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నది. వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో ప్రో + ఫోన్ మూడు కలర్ ఆప్షన్లు – గోల్డ్, బ్లాక్, పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఎలిప్టికల్ కెమరా ఐలాండ్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నది. సెల్ఫీల కోసం పంచ్ హోల్ కటౌట్ హౌసింగ్ కెమెరాతో అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. ఈ ఫోన్ ఫ్రంట్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుందని సమాచారం. ఒప్పో రెనో 10 + ఫోన్లో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఎఫ్/2.5 అపెర్చర్ తో వస్తున్నది.అంతే కాదు 16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. కలర్ ఓఎస్ 13.1 వర్షన్ మీద పని చేస్తుంది. మారీ సిలికాన్ ఎక్స్ ఎన్పీయూ చిప్ సెట్ కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్లోకి ఒప్పో రెనో10 సిరీస్ ఫోన్లు వచ్చేనెలాఖరులో గానీ, జూలైలో గానీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్లతోపాటు కొత్తగా ఒప్పో కే-సిరీస్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే11 ఎక్స్ ఫోన్ కూడా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒప్పో కే11 ఎక్స్ ఫోన్ గ్రీన్, స్కై బ్లూ కలర్స్‌లో లభిస్తుందని తెలుస్తున్నది.
24న చైనా మార్కెట్లోకి ఒప్పో రెనో 10 ప్రో+ !
by Telugu Lo Computer at May 21, 2023
Labels:
24న చైనా మార్కెట్లోకి ఒప్పో రెనో 10 ప్రో+ !
,
smart phone
,
technology
,
వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment