చౌకైన ప్లాన్ తెచ్చిన ఎయిర్ టెల్


ఎయిర్ టెల్ తన వినియోగదారులకు అత్యంత చవకైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,799 తో రీఛార్జి చేసుకుంటే కస్టమర్లకు  365 రోజులు చెల్లుబాటవుతుంది. ఈ ప్లాన్‌తో ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా... మీరు ఏడాది పొడవునా రీఛార్జ్ చేసే ఇబ్బంది ఉండదు. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 24GB డేటా అందుబాటులో ఉంటుంది. డేటా ముగిసిన తర్వాత వినియోగదారులకు కంపెనీ 50p/MB చొప్పున ఛార్జి చేస్తుంది. వినియోగదారులు అదనపు డేటా కావాలనుకుంటే వోచర్లను కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్ రూ.1,799 ప్లాన్‌లో డేటా, కాల్‌లతో పాటు, 3600 SMSలు ఉచితంగా ఇస్తున్నారు. అంటే రోజుకు 100 SMSలు పంపుకోవచ్చు. లోకల్, STD, రోమింగ్‌లో అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. వీటితోపాటు ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జిపై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలో ట్యూన్స్, 3 నెలలు ఉచితంగా వింక్ మ్యూజిక్ ఇస్తున్నారు. దీర్ఘ కాల వ్యాలిడిటీతో సరసమైన ప్లాన్‌ను కోరుకునే వినియోగదారులకు ఇది ఉత్తమం. కాల్ చేయడానికి మాత్రమే ఎక్కువగా ఫోన్‌ని ఉపయోగించే వారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. వైఫై నెట్ వాడుకునేవారికి ఇది బాగుంటుంది. నెట్ కోసం వైఫైని ఉపయోగిస్తూ కాల్స్ కోసమే చేసేవారికి ఇది నప్పుతుంది. ఈ ప్లాన్ ద్వారా నెట్ డేటా అవసరం ఉండదు. ఎప్పుడైనా అవసరమనుకుంటే 24gb ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org