ట్విటర్ లో బ్లూ టిక్కు ఛార్జీలను సేకరించడం ప్రారంభించిన మస్క్ రీసెంట్గా యూజర్లు కంటెంట్ తో డబ్బు సంపాదించుకునే వీలుగా మానిటైజేషన్ ఆప్షన్ ను ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టారు. క్రియేటివ్ కంటెంట్ తో తీసే చిన్న చిన్న వీడియోలతో పాటు ఎక్కువ నిడివి కలిగిన వీడియోలను పోస్ట్ చేసి సబ్స్క్రిప్షన్స్ ఆధారంగా డబ్బులు సంపాదించే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్ గురించి మస్క్ తెలుపుతూ తాజాగా ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. తన అకౌంట్ ద్వారా యూజర్లు మానిటైజేషన్ పీచర్‌ను ఎలా వినియోగించాలో చెప్పారు. ఆ క్రమంలో ఎలాన్ తన అకౌంట్ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యను రివీల్ చేశారు. మస్క్ ట్విటర్ ఖాతాకు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అమెరికాలో ట్విటర్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు 5 డాలర్లుగా ఉంది. ట్విటర్ రెవెన్యూ, యాపిల్ ఇన్ యాప్ పర్చేజ్ పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి 3.39 డాలర్లు చొప్పున కంటెంట్ క్రియేటర్‌కు ట్విటర్ చెల్లిస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే మస్క్ తన అకౌంట్ ద్వారా ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ ట్విటర్ అకౌంట్లో 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి నెలకు రూ.277 మస్క్‌కు వస్తుంది. అంటే నెలకు రూ.68,42,000 వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి మస్క్ తన ఖాతా ద్వారా రూ.8.2 కోట్లు సంపాదిస్తున్నాడన్నమాట.
0 Comments