ఇప్పుడొచ్చే స్మార్ట్ ఫోన్లలో చాలా వరకూ హై రిజల్యూషన్ కెమెరాలతో వస్తున్నాయి. అందరూ సెల్ఫీలకు అధిక ప్రధాన్యం ఇస్తున్నారు. అలాగే వీడియో కాల్స్, షార్ట్స్ వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు అధిక సామర్థ్యం కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమ అమూల్యమైన క్షణాలను అందులో బంధించి భద్రపరుచుకుంటున్నారు. అయితే దీంతో ఓ సమస్య ఏర్పడుతోంది. కెమెరా సెన్సార్స్, రిజల్యూషన్ ఎంత పెరిగితే అంత ఎక్కువ సైజ్ లో ఫొటో గానీ, వీడియో గానీ స్టోర్ అవుతుంది. దీనివల్ల ఫోన్ లో స్టోరేజ్ సమస్య వస్తుంది. ఫోన్ స్టోరేజీ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అధిక సైజ్ ఉండే ఫొటోలు, వీడియోల కారణంగా ఫొన్ స్టోరేజ్ కాపాడుకోవడం ఎలా? దాని కోసము ఒక బెస్ట్ ఆప్షన్. అదే గూగుల్ ఫోటోస్. ఈ యాప్ ద్వారా మీ ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు దానిలోకి పంపించి, మీ స్టోరేజ్ ని ఫ్రీ చేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ మీరు వినియోగించడానికి మీకు తప్పనిసరిగా గూగుల్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత మీరు గూగుల్ ఫోటోస్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోన్ లోని ఫోటోలు గూగుల్ ఫోటోస్ లోకి పంపాలంటే మీకు తప్పనిసరిగా మంచి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. స్క్రీన్ పైన ఎడమచేతి వైపు మూలన మూడు గీతలపై టాప్ చేసి మెనూ ను ఓపెన్ చేయాలి. ఆ మెనూ లోనుంచి Settings ను సెలెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లిస్ట్ నుంచి “Back up & sync” ను క్లిక్ చేయాలి. దానిని Back up & sync ని టర్న్ ఆన్ చేయాలి. అప్పుడు ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు క్లౌడ్ లో సేవ్ అవుతాయి. దీనిలో మీరు బ్యాక్ అప్ చేయాలనుకుంటున్న ఫోటోలు, వీడియోల క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువ వృథా కాకుండా కంప్రెస్ చేసి సేవ్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఒరిజినల్ క్వాలిటీతో కూడా గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేస్తుంది. ఒక్కసారి మీరు ఫోటోలు, వీడియోలు బ్యాక్ అయిన తర్వాత మీరు ఫోన్ స్టోరేజ్ మొత్తాన్ని ఫ్రీ చేసుకోవచ్చు.
గూగుల్ ఫొటోస్ లో ఫోటోలు భద్రపరచండి !
by Telugu Lo Computer at April 18, 2023
Labels:
google
,
technologe
,
కెమెరా సెన్సార్స్
,
గూగుల్ ఫొటోస్ లో ఫోటోలు భద్రపరచండి !
,
రిజల్యూషన్ ఎంత పెరిగితే అంత ఎక్కువ సైజ్ లో ఫొటో గానీ
,
వీడియో గానీ స్టోర్ అవుతుంది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment