సీగూల్ పేరుతొ బీవైడీ కొత్త కారును లాంచ్ చేసింది. అధిక రేంజ్, చౌక ధర వంటి ఫీచర్లు దీని సొంతం అని చెప్పవచ్చు. ఇది 5 డోర్ హ్యాచ్ బ్యాక్ కారు. కారు మార్కెట్లోకి వచ్చిందో లేదో కొనే వారు క్యూ కడుతున్నారు. కేవలం 10 గంటల్లోనే ఈ కారుకు ఏకంగా 24 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. అంటే ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ. 9.4 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. రూ.9,999 కడితే చాలు.. ఈ స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 405 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ ఇందులో 70 కేడబ్ల్యూ మోటార్‌ను అమర్చింది. అలాగే 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు. అదిరిపోయే హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సూపర్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. విండ్ షీల్డ్ వైపర్ ఉంది. కారులో 5 ఇంచుల ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 12.8 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్లాట్ బటన్ స్టీరింగ్ వీల్, లేయర్డ్ డ్యాష్ బోర్డు, పవర్డ్ డ్రైవర్ సీటు, ఇంటిగ్రేటెడ్ వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు ఇంటీరియర్ చూస్తే చాలా ప్రీమియం కారు మాదిరి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కారు చైనా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
కొత్త ఎలక్ట్రిక్ కారు సీగూల్
by Telugu Lo Computer at April 22, 2023
Labels:
electric car
,
technologe
,
కేవలం 10 గంటల్లోనే ఈ కారుకు ఏకంగా 24 వేలకు పైగా బుకింగ్స్
,
కొత్త ఎలక్ట్రిక్ కారు సీగూల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment