గత సంవత్సరం ఓపెన్‌ఎఐ, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంలో చాట్‌జిపిటి లాంచ్ అయినప్పటి నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లు పాపులర్ అయ్యాయి. దీని తర్వాత కొన్ని కంపెనీలు వివిధ ఏఐ ప్రొడక్టులను అనౌన్స్ చేశాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్‌తో సమాజానికి నష్టమని, మోసపూరితంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ, AI అంతిమంగా మానవాళికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. విద్యా రంగాన్ని చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ మెరుగుపరుస్తాయని తెలిపారు.ఈ విషయంపై బిల్ గేట్స్ బ్లాగ్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచ అసమానతలను తగ్గించడానికి, హెల్త్‌కేర్ మెరుగుపరచడానికి, వర్క్‌ప్లేస్ ప్రొడక్టివిటీ మెరుగుపరచడానికి AI సహాయపడే కొన్ని మార్గాలను పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ రిస్క్‌ని, పొటెన్షియల్ బెనిఫిట్స్‌తో ఫియర్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన హైలెట్ చేశారు. ఎడ్యుకేషన్ రంగంలో ఏఐ చాలా మార్పులు తీసుకొస్తుందని బిల్‌గేట్స్ ప్రధానంగా పేర్కొన్నారు. స్టూడెంట్స్‌కి టీచ్ చేయడంలో హ్యూమన్ ట్యూటర్స్‌ని రీప్లేస్ చేయగలవని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు తమ రీడింగ్, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచుకునేలా చేయడంలో AI చాట్‌బాట్‌ల సామర్థ్యాన్ని గేట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. AI చాట్‌బాట్స్‌తో పిల్లలు ఎలా చదవాలో నేర్చుకునే సమయాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్స్‌గా, రైటింగ్‌పై ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. AI చాట్‌బాట్‌లు విద్యార్థుల మ్యాథ్స్ స్కిల్స్ మెరుగుపరచడంలో, ఉపాధ్యాయులకు సహాయంగా, విద్యార్థులకు సరైన ఫీడ్‌బ్యాక్ అందించడంలో కీలకంగా పని చేస్తాయని తెలిపారు. 'AI చాట్‌బాట్‌ల అభివృద్ధి, వాటి సామర్థ్యాలను విస్తరించడం కొనసాగుతుంది. రానున్న కాలంలో చాట్‌బాట్‌లు మరింత అధునాతనంగా, సమర్ధవంతంగా తయారవుతాయి. దీంతో లెర్నింగ్ ప్రాసెస్ మరింత ప్రభావవంతంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చే మార్పులపై పాజిటివ్‌గా ఉన్నాం. లెర్నింగ్ ప్రాసెస్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.' అని బిల్‌గేట్స్ ధీమా వ్యక్తం చేశారు. AI చాట్‌బాట్‌ల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, AIకి సంబంధించిన రిస్క్‌ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని గేట్స్ చెప్పారు. రానురాను మరింత అడ్వాన్స్‌గా AI మారుతున్నప్పుడు, ఎథికల్‌గా డెవలప్ చేస్తున్నారా? మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటున్నారా? లేదా అనే అంశాలు నిర్ధారించుకోవాలని అభిప్రాయపడ్డారు. AI టెక్నాలజీ అభివృద్ధిలో సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయాణానికి AI చాట్‌బాట్‌లు ప్రారంభం మాత్రమే అన్నారు. సరైన విధానంతో, ఏఐ ప్రపంచాన్ని, మనం ఎన్నడూ ఊహించని విధంగా మారుస్తుందని స్పష్టం చేశారు.
0 Comments