వాట్సాప్ 'కీప్ ఇన్ చాట్' పేరుతో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. డిసప్పియరింగ్ మెసేజెస్ చాట్‌లో ఉన్న యూజర్లు నచ్చిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి దాన్ని సేవ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇలా సేవ్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ పంపించిన వ్యక్తికి ఒక అలర్ట్ వెళ్తుంది. అప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తి దానిని రిసీవర్ సేవ్ చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవచ్చు. సున్నితమైన మెసేజ్‌లు తమ చాటుతో పాటు అవతల వ్యక్తి చాట్‌లో కూడా డిలీట్ అయిపోవాలని కోరుకునే వారి కోసం డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను వాట్సాప్ గతంలో పరిచయం చేసింది. ఏదైనా ఒక చాట్‌కు ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. అందులో పంపిన మెసేజ్‌లన్నీ ఆటోమేటిక్‌గా నిర్ధిష్ట సమయం తర్వాత డిలీట్ అయిపోతాయి. అయితే మెసేజ్‌లు అన్ని డిలీట్ అవ్వకుండా కొన్ని ముఖ్యమైనవి సేవ్ అయితే బాగుండు అని యూజర్లు కోరుకుంటున్నారు. వీరి కోసమే వాట్సాప్ "కీప్ ఇన్ చాట్ (Keep In Chat)" లేదా కీప్ మెసేజెస్ అనే ఫీచర్ పరిచయం చేసింది. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. సాధారణంగా పంపించే మెసేజ్‌లు రిసీవర్ చాట్‌లో ఉండకూడదనే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను మీరు ఆన్ చేస్తారు. కాగా రిసీవర్ మీరు పంపిన ఏదైనా మెసేజ్‌ను కీప్ ఇన్ చాట్ ఫీచర్‌తో సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. ఎందుకంటే వారు మీ అనుమతి లేనిదే మీరు పంపిన మెసేజ్‌లను సేవ్ చేసుకోలేరు. మీ మెసేజ్‌ను వారు సేవ్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు వెంటనే ఒక అలర్ట్ వస్తుంది. తద్వారా ఆ మెసేజ్‌ను అవతలి వ్యక్తి సేవ్ చేసుకోవాలా వద్దా అనేది మీరే నిర్ణయించవచ్చు. ఫలితంగా మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదు. ముందుగా చెప్పినట్లు డిసప్పియరింగ్ మెసేజెస్ చాట్‌లోని మీ మెసేజ్లను రిసీవర్ ఫోన్‌లో సేవ్ కావాలా వద్దా అనే అంతిమ నిర్ణయం మీదే అవుతుంది. ఒకవేళ మీ మెసేజ్‌లు అవతలి వ్యక్తి డివైజ్‌లో సేవ్ కావొద్దనుకుంటే.. మీరు అనుమతి ఇవ్వకుండా ఉండొచ్చు. అప్పుడు డిసప్పియరింగ్ మెసేజెస్‌కి సెట్ చేసిన టైమ్ దాటిపోయినప్పుడు మీ మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. వాట్సాప్ మీరు సేవ్ చేసిన మెసేజ్‌లను బుక్‌మార్క్ ఐకాన్‌తో నోట్ చేస్తుంది. మీరు చాట్ ద్వారా చూడగల ఈ మెసేజ్‌లను "కెప్ట్ మెసేజెస్" ఫోల్డర్‌లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ యూజర్లందరికీ ఈ ఫీచర్ రిలీజ్ అవుతుంది. ఇది ఇంకా మీ ఫోన్‌లో కనిపించకపోతే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. అప్పటికీ రాకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
0 Comments