టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీలో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 312 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే 10 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కడానికి కేవలం గంట టైమ్ పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ కారుపై కంపెనీ 8 ఏళ్లు వారంటీ కూడా అందిస్తోంది. లేదంటే 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. బ్యాటరీ, మోటార్‌కు ఈ వారంటీ వర్తిస్తుంది. కారులో మల్టీ మోడ్ రెజెన్, క్రూయిజ్ కంట్రోల్, ఐటీపీఎంఎస్, స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.9 సెకన్లలోనే అందుకుంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వద్దనుకుంటే రెగ్యులర్ చార్జింగ్ ఉంటుంది. 15 ఏఎంపీ ప్లాగ్ పాయింట్ ద్వారా కారుకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. 10 నుంచి 90 శాతం బ్యాటరీ ఫుల్ కావడానికి 9 గంటలు పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ అయితే గంటలో 80 శాతం ఫుల్ అవుతుంది. ఇందులో ఐపీ 67 రేటింగ్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును తయారు చేశారు. ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్, షాక్ ప్రొటెక్షన్, షార్ట్ ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి. రిమోట్ కమాండ్స్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, డ్రైవింగ్ అండ్ ట్రిప్ అనలిటిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లార్జెస్ట్ ఈవీ సర్వీస్ నెట్‌వర్క్ టాటా మోటార్స్ ప్రత్యేకత. డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంది. ఓటీఏ అప్‌డేట్స్ పొందొచ్చు. ఇంకా రోజంతా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ పొందొచ్చు. ఉచితంగానే ఇంట్లో చార్జింగ్ ఇన్‌స్టాలేషన్ చేస్తారు. కంపెనీ ఈ కారులో 30.2 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చింది. ఇంకా ఈ కారులో ప్రీమియం లుక్ ఇంటీరియర్స్ ఉంటాయి. డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా జెడ్ కనెక్ట్ యాప్ ద్వారా కారుతో కనెక్ట్ కావొచ్చు. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఫుల్ కావడానికి దాదాపు రూ. 350 వరకు ఖర్చు అవుతుంది. ఒక కేడబ్ల్యూకు రూ.10 ఖర్చు అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 30.2 కేడబ్ల్యూ. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మి వెళ్లొచ్చు. అంటే రూ.350తో 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అంటే ఒక కిలోమీటరుకు ఒక రూపాయి ఖర్చు వస్తుంది. అంటే కారులో ఐదు మంది వెళ్లొచ్చు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.100 కన్నా తక్కువ ఉంటే సరిపోతుంది.
0 Comments