Ad Code

లాప్‌టాప్‌లకు మాంద్యం ఎపెక్ట్ !


కరోనా మహమ్మారి ఉధృతి వేళ.. వర్క్ ఫ్రం హోం కల్చర్‌తో డిజిటల్ సేవల డిమాండ్ పెరిగింది. దీంతో 2020 నుంచి గతేడాది ప్రారంభం వరకు పర్సనల్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లకు ఫుల్ గిరాకీ వచ్చింది. కానీ, తర్వాత కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఇంధన వ్యయం.. అటుపై ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వివిధ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేయడంతో ఆర్థిక మాంద్యం ముప్పు ముందుకు తోసుకొచ్చింది. ఫలితంగా అన్ని రంగాల సంస్థలు పొదుపు మంత్రం పటిస్తున్నాయి. 2021తో పోలిస్తే 2022లో ప్రపంచవ్యాప్తంగా లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల గిరాకీ 16 శాతం తగ్గింది. గతేడాది కేవలం 28.51 కోట్ల లాప్‌టాప్‌లు మాత్రమే అమ్ముడయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలియాస్ పేర్కొంది. కరోనాకు ముందుతో పోలిస్తే గ్లోబల్ పర్సనల్ కంప్యూటర్స్ సేల్స్ 2022లో సానుకూలంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019తో పోలిస్తే 2022లో ఏడు శాతం ఎక్కువగానే పర్సనల్ కంప్యూటర్ల సేల్స్ నమోదయ్యాయి. ఇక డెస్క్‌టాప్ కంప్యూటర్లు, నోట్‌బుక్‌ల విక్రయాలు 2022 నాలుగో త్రైమాసికంలో 29 శాతం తగ్గి 6.54 కోట్లకు పడిపోయాయి. నోట్‌బుక్స్ సేల్స్ 30 శాతం పతనమై 5.14 కోట్లకు పరిమితం అయ్యాయి. అంతర్జాతీయంగా పర్సనల్ కంప్యూటర్ల విక్రయంలో అగ్రభాగం.. లెనోవో అందుకోగా, తర్వాతీ జాబితాలో హెచ్‌పీ, డెల్‌, ఆపిల్‌, అసుస్ నిలిచాయి. గతేడాది చివరి త్రైమాసికంలో నోట్‌బుక్స్ సేల్స్ 30 శాతం తగ్గి 5.14 కోట్లకు పరిమితమైతే.. గత ఏడాది కాలంలో 19 శాతం తగ్గి 22.38 కోట్లతో సరిపెట్టుకున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల విక్రయాలు 2022 నాలుగో త్రైమాసికంలో 1.41 కోట్లు (24 శాతం పతనం) నమోదైతే.. ఏడాది మొత్తంలో ఏడు శాతం తగ్గి 6.13 కోట్లకు దిగి వచ్చాయి. చివరి త్రైమాసికంతోపాటు గతేడాది సేల్స్‌లో లెనోవోదే టాప్‌. 29 శాతం సేల్స్ తగ్గినా 2022లో లెనోవో లాప్‌టాప్‌లు 1.55 కోట్లు అమ్ముడయ్యాయి. ఇది మొత్తం సేల్స్‌లో 23.9 శాతం. రెండో స్థానంలో ఉన్న హెచ్‌పీ 1.32 కోట్ల లాప్‌టాప్‌లు విక్రయించింది. గతేడాది మొత్తం విక్రయాల్లో 19.4 శాతం మార్కెట్ షేర్ సొంతం చేసుకున్నది. తర్వాతీ స్థానంలో ఉన్న డెల్ 1.08 కోట్లతో 17.4 శాతం వాటా, ఆపిల్ 9.5 శాతం, అసుస్ 7.2 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu