ఓటీటీ సంస్థలు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెడుతున్నాయి. ఈ మూడు ఓటీటీ దిగ్గజాలు ఒకే విధమైన కంటెంట్‌ను అందిస్తున్నట్లు అనిపించినప్పటికీ అవి వేర్వేరు ధరలు, ప్రయోజనాలతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు ఏ ప్లాన్ ఉత్తమమో? నిర్ణయించుకోవడం కష్టతరంగా మారింది. నెట్ ఫ్లిక్స్ రూ.149 నుంచి రూ.649 వరకూ నెలవారీ వివిధ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.149 ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్‌ను కేవలం ఒక్క స్క్రీన్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. దీని వ్యాలిడిటీ నెలరోజులు. అయితే వార్షిక ప్లాన్ ధర మాత్రం రూ.1788గా ఉంది. అయితే రూ.199 ప్లాన్‌లో టీవీలో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంది. కానీ ఒకేసారి టీవీ, ఫోన్‌లో వీక్షించే అవకాశం ఉండదని గమనించాలి. ఈ ప్లాన్ వార్షిక వ్యాలిడిటీతో కావాలనుకుంటే మాత్రం రూ.2388 చెల్లించాల్సి ఉంటుంది. రూ.499ను స్టాండర్డ్ ప్లాన్ అని కంపెనీ ప్రకటించింది. ఒకేసారి ఫోన్, టీవీల్లో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.5988గా ఉంది. అలాగే రూ.649 ప్లాన్‌లో ఒకేసారి ఆరు డివైజ్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.7788గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. అలాగే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటే అమెజాన్‌లో ఆర్డర్లకు సంబంధించి ప్రత్యేక రాయితీలను కూడా పొందవచ్చు. వీటి ధరలు రూ.299 నుంచి రూ.1499గా ఉంది. రూ.299తో నెల రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో ప్రైమ్ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. రూ.599ను మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో పొందవచ్చు. అయితే ఈ ధరలో కేవలం మొబైల్‌లో మాత్రమే కంటెంట్ వీక్షించేలా మరో ప్లాన్ అమెజాన్ అందిస్తుంది. కాబట్టి సబ్‌స్క్రైబ్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1499ను చెల్లించాలి. అయితే అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999గా కంపెనీ నిర్ణయించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కూడా ఉంది. ఉచిత యాక్సెస్‌లో వినియోగదారులు ఎంపిక చేసిన లు, టీవీ షోలను యాడ్స్‌తో చూడాల్సి ఉంటుంది. అలాగే ఓ ఐదు నిమిషాల పాటు లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్‌ను ఆశ్వాదించవచ్చు. అయితే హాట్ స్టార్‌ను రూ.299తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ మొత్తం యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు. గరిష్టంగా నాలుగు పరికరాల్లో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. రూ.899 ప్లాన్‌తో సంవత్సరం పాటు కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇది కేవలం క్రికెట్ అభిమానులను ఉద్దేశించిన ప్లాన్. అయితే అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను సంవత్సరం పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించాలంటే రూ.1499గా చెల్లించాల్సి ఉంటుంది.
0 Comments