జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ bard AI కోడింగ్ రాయడంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు సాయం చేయగలదని ఆల్ఫాబెట్ నేతృత్వంలోని గూగుల్ తెలిపింది. జనరేటివ్ AI, టెక్నాలజీ సాయంతో గత డేటాను గుర్తించడానికి బదులుగా కొత్త డేటాను క్రియేట్ చేసేందుకు బార్డ్ AI సాయం చేయనుందని గూగుల్ వెల్లడించింది. దీంతోపాటు మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. Google bard AI, 20 ప్రోగ్రామింగ్ భాషల్లో కోడింగ్ రాయగలదని గూగుల్ తెలిపింది. ఇందులో Java, C++, Python సహా మరిన్ని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నట్లు వెల్లడించింది. AIతో పనిచేసే గూగుల్ బార్డ్ కోడింగ్ రాయడం సహా వాటి గురించి స్పష్టంగా వివరించగలదని స్పష్టంచేసింది. దీనితో పాటు కోడ్ ను ఆప్టిమైజ్ చేయగలదని, మరియు మరింత కచ్చితత్వంతో పనిచేయగలదని గూగుల్ వివరించింది. ప్రస్తుతం గూగుల్ బార్డ్ AI ను గూగుల్ సెర్చ్ టూల్‌కు బదులుగా బోట్‌తో చాట్ చేయగలిగిన వారు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గూగుల్ బార్డ్ మూడు వెర్షన్లు లేదా డ్రాఫ్ట్ లను మాత్రమే చూపిస్తోంది. ఇందులో యాజర్లు దేనికోసమైన సెర్చ్ చేస్తుంటే "గూగుల్ ఇట్" అనే బటన్ మాత్రమే చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్ సాయంతో ఓపెన్ ఏఐ స్టార్టప్ రూపొందించిన ChatGPT 2021 సంవత్సరం వరకు ఉన్న డేటాను మాత్రమే విశ్లేషించి వినియోగదారులకు సమాధానాలు ఇస్తోంది. అదే గూగుల్ అభివృద్ధి చేసిన బార్డ్ మాత్రం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని వినియోగించుకొని యూజర్లకు సమాధానం ఇస్తుంది. ఇది గూగుల్ బార్డ్‌కు కొంత మేలు చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ సంస్థ ఆశించినంతగా, ఈ బార్డ్ AI వినియోగదారులకు చేరువ కాలేదు. కారణం, గూగుల్ బార్డ్ AI లాంచింగ్ సమయంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి బార్డ్ తప్పుగా సమాధానం ఇచ్చింది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలోనూ భారీగా ట్రోల్ లను కూడా ఎదుర్కొంది. మైక్రోసాఫ్ట్ సాయంతో వచ్చిన ChatGPT కంటే Google Bard AIను ముందుగా లాంచ్ కావాలనే లక్ష్యంతోనే ఈ పనిచేశారని, ఫలితంగానే తప్పలు వస్తున్నాయంటూ విమర్శలు చేశారు. స్వల్పకాలిక లక్ష్యాలను వదిలి దీర్ఘకాలిక లక్ష్యాలతో కోసం పనిచేయాలని పలువురు గూగుల్‌ను అప్పట్లోనే సూచించారు. లాంచ్ అయినప్పటి నుంచి ChatGPT అధిక సంఖ్యలో వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుకుంటుండగా.. టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన Bard మాత్రంగా అంతగా ప్రభావం చూపడం లేదు.
0 Comments