లావా బ్లేజ్ 2 పేరుతో ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ లో విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. ఇది మోటోరోలా, రియల్ మీ కంపెనీలకు చెందిన పలు బడ్జెట్ లెవెల్ ఫోన్లతో పోటీ పడనుంది. అలాగే బ్లేజ్ 2 5జీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 11, 999గా ఉంది. డిజైన్, లుక్.. లావా బ్లేజ్ 2 సరసమైన ధరలో లభ్యమవుతున్నప్పటికీ ఫోన్ మెటీరియల్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇది ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్, పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరలో ఇది అసాధారణమైన డిజైన్ అని చెప్పాలి. గతేడాది మోటరోలా మోటో జీ22ను వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌కు బదులుగా హోల్-పంచ్ డిస్‌ప్లేతో ప్రారంభించింది. దీనిని లావా బ్లేజ్ 2లో వినియోగించింది. బ్లోట్-ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. అంటే వినియోగదారు స్మార్ట్‌ఫోన్ కోసం అవసరమైన యాప్‌లను మాత్రమే పొందుతారు. జీమెయిల్, కెమెరా సెట్టింగ్స్ వంటి కొన్ని ఆండ్రాయిడ్ స్టాక్ యాప్‌లు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్, ఐపీఎస్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 2.5D కర్వ్డ్ స్క్రీన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుకవైపు13-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ స్నాపర్ ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్ ధర రూ. 8,999గా ఉంది.
0 Comments