'కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది' అని ఎలాన్ మస్క్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా 'ట్రూత్‌జీపీటీ' పేరిట సొంత చాట్‌బాట్ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు.
0 Comments