పప్పు తింటే చీము పడుతుందా?

 

పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org