Ad Code

కివీ పళ్ళు తింటున్నారా?

 


కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే ఇవి ఎక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. ముదురు గోధుమ రంగులో లేత ఆకుపచ్చ గుజ్జు కలిగి వుంటుంది. ఒకసారి తింటే పదే పదే తినాలని అనిపిస్తుంది. ఈ పండు పుల్లగా, తియ్యగా వుంటుంది. కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. కివీపండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, విటమిన్ సి వుంటుంది. పిల్లల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 8 నెలల వయసు నుంచే పిల్లలకు దీనిని తినిపించవచ్చు. రోజూ రెండు కివీపళ్ళు తింటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా వుంటుంది. కొవ్వు తక్కువగా వుండడం వల్ల ఆకలి తగ్గిస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుండడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రొమాంటిక్ మూడ్ కూడా బాగా వుండేలా చేస్తుంది. కొత్తగా పెళ్ళయిన దంపతులు కివీ పళ్ళను బాగా తింటే మంచిది.

Post a Comment

0 Comments

Close Menu