Ad Code

కొబ్బరికాయ పీచులేకుండా దేవుడికి కొట్టొచ్చా?

 



మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగిన సమయంలో లేదా పూజా కార్యక్రమాలలో కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పూజానంతరం ఆ భగవంతుడికి కొబ్బరికాయను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటారు. అయితే కొబ్బరికాయను పిలకతో కొట్టడం వల్ల కొబ్బరికాయకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే కేవలం పిలక ఉన్న కొబ్బరికాయలు కొట్టడం మనం చూస్తుంటాము. అయితే జుట్టు లేకుండా కొబ్బరికాయ దేవుడికి కొట్టకూడదని చాలా మంది చెబుతుంటారు. సాధారణంగా కొబ్బరి కాయను మన ఆత్మ స్వరూపంగా భావించి మనలో ఉన్నటువంటి ఆహారాన్ని తొలగిస్తూ దేవుడికి కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు సాక్షాత్తు మనిషి స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచును మన శరీరంగా భావిస్తారు. దృఢంగా గా ఉండే చిప్ప మన ఎముకలు అందులో ఉండే నీరు ప్రాణాధారం పైన ఉన్న మూడు కన్నులు ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. అందుకోసమే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ కొబ్బరికాయ కొట్టాలి. అందుకోసమే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు తప్పనిసరిగా పీచుతోనే కొట్టాలని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు త్రిపురాసుర అనే రాక్షసుడిని చంపడానికి వెళ్ళినప్పుడు గణపతి ఆజ్ఞ మేరకు మూడు కళ్ళు జుట్టులా శిరస్సు ఉన్న కొబ్బరికాయలు సృష్టించి వినాయకుడికి సమర్పించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకోసమే దేవుడికి టెంకాయ సమర్పించేటప్పుడు తప్పనిసరిగా పిలక ఉన్న కొబ్బరికాయలు కొట్టినప్పుడే పూజ సంపూర్ణం అవుతుంది అని చెప్పవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu