డెంగూ దోమ ప్రత్యేకతలు !


డెంగ్యూ జ్వరం వ్యాపించడానికి కారణం ఓ ప్రత్యేకమైనటు వంటి దోమకాటు. ఈ దోమ పేరు ‌ఎడీస్ ఈజిప్టై. ఈ దోమకున్న ప్రత్యేకతలు ఏమంటే మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు. ఉడయం 5 నుంచి 7 గంటల లోపల,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల కుట్టడం దీనికిష్టం. మంచి నీళ్ళలోనే గుడ్లు పెడుతుంది.మురికి నీళ్ళ జోలికి పోదు.పెద్దగా ఎగరలేదు . అందుకే ఇంట్లోనే వుండి కుట్టుకుంటూ వుంటుంది. ఒక వూరు పనిపూర్తయిన తరువాత మరో వూరు చూసుకుంటుంది వీలయితే 6 వారాల్లో దీని గుడ్డు పిగులుతుంది. ఇబ్బందులు ఉంటే 6 నెలలవరకు గుడ్డు బ్రతికే వుండగలదు. ఎక్కడ మనం బట్టలు సరిగా వేసుకోమో చూసి మోకాళ్ళ క్రింద, మోచేతుల క్రిందనే ఎక్కువగా కుడుతుంది. మనిషి రక్తమంటే ఇష్టమెక్కువ. కుక్కల్ని, పశువుల్ని యీ దోమ పెద్దగా కుట్టదు లావుగా, చూడటానికి విచిత్రంగా, వంటి మీద పులి మీద చారల లాగా పట్టీలు ఉంటాయి. అందుకే దీనినిటైగర్ దోమ అని అంటారు. ఆడ దోమ మాత్రమే కుడుతుంది. ఆడ మగ తేడా లేకుండా అందరిని కుడుతుంది. ఈ పాడు దోమ చేత కుట్టించు కోకుండా జాగ్రత్త పడదాం. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org