Ad Code

మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనల్లో దిగనుంది. రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేలా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకుని రానుంది. ఇందులో భాగంగా- అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనబోతోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ మనసు మార్చాలంటూ అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర రుద్రకోట వద్ద నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. 45 రోజుల పాటు అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన పాదయాత్ర ఇది. ఇక బీజేపీ నాయకులు కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యులు కానున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు వారు పాదయాత్రలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా కావలిలో వారు పాదయాత్రతో కలుస్తారు. రైతులతో కలిసి నడుస్తారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీమంత్రి సుజన చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ పాదయాత్రలో పాల్గొంటారు.

Post a Comment

0 Comments

Close Menu