Ad Code

వాట్సాప్ స్టిక్టర్స్!


స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వారూ వాట్సాప్ యూజర్సే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది వాట్సప్. తాజాగా మరో ఫీచర్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ స్టిక్టర్స్ పేరుతో దీనిని తీసుకొచ్చింది. ఇందులో యూజర్సే స్వయంగా స్టిక్కర్లు తయారు చేసుకోవచ్చు. తయారు చేసిన వాటిని ఇతరులకు పంపించొచ్చు. ఇందుకోసం కొత్త టూల్ ను సైతం రిలీజ్ చేసింది సంస్థ. ఈ టూల్ ను వాట్సాప్ వెబ్ యూజ్ చేసే సమయంలోనే డెస్క్ టాప్ వినియోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. వాట్సప్ లో కొన్ని రోజులుకు స్టిక్కర్ అందుబాటులో ఉన్నప్పటికీ స్వయంగా యూజర్సే తయారు చేసుకునే ఆప్షన్ ను మాత్రం ప్రస్తుతం తీసుకొచ్చారు. అయితే పీసీ, మ్యాక్ యూజర్స్ కు మాత్రమే ప్రస్తుతానికి ఇది అందుబాటులోకి వస్తుందని  సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ కు ఇది ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. వాట్సాప్ లో స్టిక్కర్స్ పంపించే వారు ప్లేస్టోర్ నుంచి స్టిక్కర్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని దానిలోంచి స్టిక్కర్స్ ను డౌన్ లోడ్ చేసుకునే వారు. వాటిని వాట్సాప్ లో యాడ్ చేసుకుని ఇతరులకు పంపించేవారు. కానీ మనకు నచ్చిన స్టైల్ లో నచ్చిన కంటెంట్ తో అందులో స్టిక్కర్స్ దొరకడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం వచ్చిన ఫీచర్ తో మనకు నచ్చినట్టు స్టిక్కర్లను డిజైన్ చేసుకునే చాన్స్ లభిస్తుంది. కొత్తగా యాప్ ను అప్ డేట్ చేసుకున్న వారికి ఇది అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu