Ad Code

ఎలన్ ​మస్క్​కు భారత్​ షాక్


ఇండియాలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌  సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్‌ మస్క్‌ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. లైసెన్స్‌ లేకుండా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రీ ఆర్డర్స్‌ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్‌ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల (రూ.7,400)తో బేటా వెర్షన్‌ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్‌ భారత్‌ హెడ్‌ సంజయ్‌ భార్గవ ఈ మధ్యే వెల్లడించారు . ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్‌ విభాగం  స్టార్‌ లింక్‌ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇక్కడి రెగ్యులేటర్‌ ఫ్రేమ్‌ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్‌ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్‌ఎక్స్‌కు టెలికమ్యూనికేషన్స్‌ విభాగం సూచించింది. టెలి కమ్యూనికేషన్స్‌ విభాగం నిర్ణయంపై స్పందించేందుకు స్టార్‌లింక్‌ భారత్‌ హెడ్‌ సంజయ్‌ భార్గవ నిరాకరించారు. అయితే స్టార్‌ లింక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్‌ఎక్స్‌ బిడ్‌ ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్‌ అసోసియేషన్‌లోని వన్‌వెబ్, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తదితర కంపెనీలు ట్రాయ్‌, ఇస్రోలకు లేఖలు రాశాయి. గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ అయిన హ్యూస్‌నెట్ సగటు డౌన్‌లోడ్ వేగం 19.73Mbps కాగా.. వయాశాట్ డౌన్‌లోడ్ వేగం 18.13Mbps మాత్రమే ఉండటం గమనార్హం. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉందట. భారతదేశంలో అందుబాటులోకి రాకముందే.. వినియోగదారులందరికీ 300Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ హామీ ఇవ్వడం శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు 30Mbps - 1Gbps స్పీడ్‌ల మధ్య మాత్రమే ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu