కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు సంరక్షణకు కావలసిన పోషకాలను అందిస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కలబందలో ఉన్న విటమిన్ ఇ, ఎ, సి లు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇవి తలలో రక్తప్రసరణ మెరుగుదలకు సహాయపడి జుట్టు పెరగడాన్ని బలోపేతం చేస్తాయి. కలబంద గుజ్జులో ఉండే అమైనో ఆమ్లాలు, ప్రోటీలిటిక్ ఎంజైమ్ లు చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు జుట్టు పెరుగుదలకు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. రాత్రంతా మంచినీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసుకోవాలి. ఈ మెంతుల పేస్ట్ కు కలబంద గుజ్జును కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని తలకు మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేయడంతో జుట్టుకు తగిన తేమను అందించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. దీంతో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కలబంద గుజ్జులో ప్రొటీలిటిక్ ఎంజైమ్ తలపై దెబ్బతిన్న కణాలను నయం చేసి జుట్టు తిరిగి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ విటమిన్ E ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ ల బాదం నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. విటమిన్ E లో ఉండే ఫ్రీ యాంటిఆక్సిడెంట్ మీ తల మీద దెబ్బతిన్న చర్మాన్ని, జుట్టును తిరిగి ఆరోగ్యవంతంగా చేసి పొడవైన జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ ల కలబంద గుజ్జు, నాలుగు టేబుల్ స్పూన్ ల ఆలివ్ ఆయిల్, ఒక గుడ్డు పచ్చసొన వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ళకు పట్టించాలి. అరగంట తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు పచ్చసొనలోని కొవ్వు తలకు కండీషనర్ గా పనిచేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్, కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
0 Comments